Wednesday, September 16, 2009
నాని -- పెదవే పలికిన మాటల్లోన
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా
మనలోని ప్రాణం అమ్మ
మనదైనా రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మ
నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మ
నా ఆలి అమ్మ గా అవుతుండగా
జో లాలి పాడనా కమ్మగా కమ్మగా
ఆ .
పొత్తిల్లో ఎదిగే బాబు
నా వొళ్ళో వొదిగే బాబు
ఇరువురికి నేను అమ్మవనా
నా కొంగు పట్టేవాడు
నా కడుపున పుట్టేవాడు
ఇద్దరికీ ప్రేమ అందించనా
నా చిన్ని నాన్నని వాడి నాన్నని
నూరేళ్ళు సాకనా చల్లగా చల్లగా
ఎదిగి ఎదగని ఓ పసి కూన
ముద్దులకన్నా జోజో బంగారు తండ్రి జోజో
బజ్జో లాలిజో
పలికే పదమే వినకా కనులారా నిదురపో
కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి
ఫర్ ది రిక్వెస్ట్ అఫ్ మై ఫ్రెండ్ మురళి కృష్ణ
ఎదిగి ఎదగని ఓ పసి కూన
ముద్దులకన్నా జోజో బంగారు తండ్రి జోజో
బజ్జో లాలి జో
బజ్జో లాలి జో
బజ్జో లాలి జో ..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment